ముంబయికి వెళ్ళనున్న నాగ్, వర్మ

  • IndiaGlitz, [Monday,January 22 2018]

శివ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సంచలనానికి తెరలేపిన ద్వయం కింగ్ నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ. నాగార్జున కెరీర్ శివ'కి ముందు, శివ'కి తర్వాత అన్నట్టుగా మార్చిన ట్రెండ్ సెట్టర్ ఫిలిం ఇది. ఆ తర్వాత వీరి కలయికలో అంతం', గోవిందా గోవింద' వంటి సినిమాలు వచ్చినా.. ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి. క‌ట్ చేస్తే.. దాదాపు 24 ఏళ్ల‌ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న నాల్గవ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇటీవ‌లే ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన‌ తదుపరి షెడ్యూల్ ఈ నెల 26 నుంచి ముంబ‌య్‌లో జ‌రుగ‌నుంది. అక్క‌డ దాదాపు పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంద‌ని స‌మాచార‌మ్‌. కాగా, ఈ మూవీ టైటిల్స్‌కి సంబంధించి.. ఇప్ప‌టికే రెండు పేర్ల‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు సమాచారం. అందులో మొదటిది గన్' కాగా రెండవది సిస్టం'. త్వ‌ర‌లోనే టైటిల్‌పై క్లారిటీ వ‌స్తుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌లో నాగ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండ‌గా.. నాగ్ సరసన మైరా సరీన్ కథానాయికగా నటిస్తోంది

More News

చ‌ర‌ణ్‌.. ఇద్ద‌రు అన్నయ్య‌లు

ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'రంగస్థలం' మార్చి 30న విడుదల కానుండగా....ఇక ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న‌ బోయపాటి శ్రీను సినిమాని కూడా ఈ ఏడాదిలోనే విజయదశమి సంద‌ర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ గా డా.మోహన్ బాబు

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ పదవికి  డా. మోహన్ బాబు గారు నేడు ప్రమాణ స్వీకారం చేసారు.

మళ్ళీ నటిస్తానంటున్న బాపు బొమ్మ

దివ్యవాణి....తాను బాపుగారి బొమ్మ.... తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుందీ ముద్దుగుమ్మ...

ఎన్టీఆర్ పాత్రలో నాని...

వరుస విజయాలను సాధిస్తున్న నేచరల్ స్టార్ నాని ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్దం'సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' ఆడియో ఆవిష్కరణ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం 'తొలిప్రేమ'.