ప్రపంచ శిఖరం పై నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. అందాల తారలు అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భక్తిరస చిత్రం ప్రస్తుతం మహాబలేశ్వరంలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ....మహాబలేశ్వరంలో మేఘాల నడుమ నడుస్తుంటే ప్రపంచ శిఖరం పై ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అంటూ సంతోషం వ్యక్తం చేసారు. అంతే కాకుండా ఆయన చెప్పినట్టుగా మహాబలేశ్వరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసారు. ఈ భక్తిరస చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున ఓం నమో వెంకటేశాయ చిత్రంతో కూడా ఆకట్టుకుని సంచలన విజయం సాధిస్తారని ఆశిద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com