ఓం నమో వేంకటేశాయ రిలీజ్ ఎప్పుడో చెప్పిన నాగార్జున..!

  • IndiaGlitz, [Tuesday,September 06 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో రూపొందుతున్న భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ భ‌క్తిర‌స చిత్రంలో అందాల తార‌లు అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్ ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇంత‌కీ..ఓం న‌మో వేంక‌టేశాయ ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది అని నాగార్జున‌ను అడిగితే...రాఘ‌వేంద్ర‌రావు గారు ఏమాత్రం రాజీప‌డ‌కుండా భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
సినిమా చాలా బాగా వ‌స్తుంది. అలాగే కీర‌వాణి గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ విష‌యానికి వ‌స్తే... సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం. అయితే...ముందు డేట్ ఎనౌన్స్ చేసి ఆత‌ర్వాత మార్చ‌డం ఇష్టం లేదు. అందుచేత అంతా ప‌క్కాగా రెడీ అయిన త‌ర్వాత ఎప్పుడు రిలీజ్ అనేది ఎనౌన్స్ చేస్తాం అని తెలియ‌చేసారు. సో...అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే...ఓం న‌మో వేంక‌టేశాయ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది..!

More News

అఖిల్ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పిన నాగ్..!

అక్కినేని అఖిల్ రెండో సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఉంటుందని ఇటీవల నాగార్జున ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు నిర్మలా కాన్వెంట్ మూవీ గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగార్జున ని అఖిల్ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ...

పూరి ఇజం టీజర్ వచ్చేసింది..!

నందమూరి కళ్యాణ్ రామ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం.

ప్రేమ దేనినైనా గెలుస్తుంది అని చెప్పే ఇన్ స్పైయిరింగ్ లవ్ స్టోరి నిర్మలా కాన్వెంట్ - నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా,శ్రేయా శర్మను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మలా కాన్వెంట్.

ఈ నెల 16న వస్తోన్న 'అత్తారిల్లు'

అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అంజన్ కె.కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అత్తారిల్లు’.

రెండు పాటలు మినహా 'ఇంట్లో దెయ్యం..నాకేం భయం' పూర్తి- విజయదశమి రిలీజ్

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి,సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్ టైన్ చేశాయి.అత్తారింటికి దారేది,