బంగార్రాజు మొదటిరోజు వసూళ్ళు 17.5 కోట్లు గ్రాస్: నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు సినిమా ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా, విడుదలైన మొదటిరోజునే సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్‌గా నమోదు చేసుకుంది. ఈ సందర్భంగాన్ని పురస్కరించుకుని శనివారంనాడు బంగార్రాజు చిత్ర యూనిట్ అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్య్రకమంలో నాగార్జున, నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ, మలయాళ నటుడు సూర్య, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ జునైద్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు పాదాబివందనం తెలియజేస్తూ ఆరంభించారు. జనవరి 14న అనేది మాకు చాలా ప్రత్యేకమైన రోజు. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. నాన్నగారికి సంక్రాంత్రికి సినిమాలు విడుదల చేయాలని అంటుండేవారు. అప్పటి నుంచీ ఏదో ఒక సినిమా విడుదల అవుతూనే వుండేది. నాన్నగారు చేసిన `దసరా బుల్లోడు` జనవరి14న విడుదలై అప్పట్లో అఖండ విజయాన్ని చవిచూసింది. అలాగే మేము ఈసారి బంగార్రాజు విడుదలచేశాక బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.
అసలు ఈరోజు స్టేజీపై టెక్నీషియన్స్ అందరూ వున్నారు. వారి గురించి ఎందుకు చెబుతున్నానంటే, సినిమాకు వెన్నెముకలాంటివారు వీరంతా. వీరంతా కలిసికట్టుగా చేయబట్టే సక్సెస్ వైపు సాగింది, అంది ఎంత సక్సెస్ అయిందంటే, ఈరోజు పొద్దునే కలెక్షన్లు వచ్చాయి. ఒక్కరోజులోనే 17.5 కోట్ల గ్రాస్ ఆంధ్ర, తెలంగాణ, ఓవర్‌సీస్ అంతా కలిపి వచ్చింది అని చెప్పారు. ఈ సినిమా మైసూర్ ప్రాంతంలో తీశాం. అక్కడ ఎంతోమంది సహకరించారు. ప్రతి నటీనటులకూ, టెక్నీషియన్స్ కు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్షన్ సీన్స్‌ను రామ్ లక్ష్మణ్ బాగా ఓన్ చేసుకుని డిజైన్ చేశారు. వాటికి మంచి పేరు వస్తుంది అన్నారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. సంక్రాంతికి ఎ.పి.లో మంచి వాతావరణ వుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవిగారు జగన్‌తో చర్చలు జరిపారు కాబట్టి మొత్తం సినిమా పరిశ్రమకు పండుగ వచ్చేలా చేశారని త్వరలో ఆ వివరాలు తెలియచేస్తారని అన్నారు.
ఈ సినిమా చూశాక పెద్ద బంగార్రాజు పాత్ర ఎక్కువ వుందని చాలామంది అన్నారు. అది పాత్రపరంగా దర్శకుడు డిజైన్ చేసిందే. సినిమా చూసినవారంతా వారి భావోద్వేగాలు తెలియజేస్తుంటే, తీసిన సినిమాకు సార్థకత ఏర్పడిందనిపించింది. బంగార్రాజు సినిమా చూశాక అమల ఇంటికి రాగానే ఆమె అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసింది. అవి ఆనందంతో కూడిన కన్నీళ్ళు. వారు మనల్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పింది. వారు మా వెనుక వున్నారనే ఫీలింగ్‌ను వ్యక్తం చేసింది. ఇదే అభిప్రాయాన్ని చాలామంది వారి అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, నాన్నలను గుర్తుచేసుకున్నామని చెప్పారు.
ఇక ఈ సినిమాలో ముగింపులో చూపినట్లుగా మరో సినిమాకూడా తీయవచ్చు. దర్శకుడు ఓ క్లూ కూడా ఇచ్చాడు. ప్రతి 24 ఏళ్ళకు శివాలయంలో హోమం చేయాలని.. కానీ ఇప్పుడప్పుడే సినిమా చేయలేం. ఆలోచించి అన్నీ అనులిస్తే అప్పుడు చూద్దాం అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ, బంగార్రాజులో చేస్తున్నప్పుడే `సోగ్గాడే చిన్నినాయన` పై భారీ అంచనాలున్నాయి. అది తెలిసి ఈ సినిమాలో చేయడం నాకు సవాల్ గా అనిపించింది. గ్రామీణ నేపథ్యం, ఎన్జర్జిక్ పాత్ర ఇంతవరకు చేయలేదు. ఈ పాత్ర చేయడానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చాలా సపోర్ట్ చేశాడు. `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమాతో ఆయన నన్ను ప్రేక్షకులకు దగ్గర చేశాడు. బంగార్రాజుతో మరింత దగ్గరకు వెళ్ళేలా చేశాడు. కథ విన్నాక ఆయన చెప్పినట్లు చేయడమే. ఆయనకు అందరి పల్స్ బాగా తెలుసు.
ఇక షూటింగ్‌లో నాన్నగారు నన్ను డామినేట్ చేశారనే ఫీలింగ్ ఓసారి కలిగింది. అది ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాను. కాస్త జలసీ అనిపించినా ఆరోగ్యకరమైన వాతావరణంలో నన్న నడిపించింది అని తెలిపారు.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ, ఎ.పి.లో మొదట కర్ఫ్యూ అనుకున్నారు. కానీ వై.ఎస్. జగన్ గారు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అది మాకు కలిసివచ్చింది. జనాలంతా పండగకు ఇంటికి వస్తారు. రాత్రి పూట జర్నీ చేస్తారు. కాబట్టి కర్ఫ్యూ ఎత్లివేశారు. ఇక మా సోదరుడు కన్నబాబు కూడా సోదర భావంతో సినిమా బాగా ఆడాలనే అనుకున్నారు. ఇలా అందరూ నాగార్జునతోపాటు టెక్నీషియన్స్ అంతా సినిమా సక్సెస్ కావాలని కష్టపడి పని చేశారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పాటలకు తగిన ట్యూన్స్ ఇచ్చి ఆడియోను మరింత క్రేజ్ తెచ్చేలా చేశాడని అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, ఈ సినిమా కథను పూర్తిగా ఓన్ చేసుకుని సందర్భానుసారంగా సంగీతం వచ్చేలా చేశాను. నేపథ్య సంగీతానికి బాగా పేరు వచ్చింది. ఇదంతా రావాలంటే దర్శకుడితోపాటు నాగార్జున గారి తోడుకూడా ఎంతో వుందని తెలిపారు.
మలయాళ నటుడు సూర్య మాట్లాడుతూ, ఇంతకుముందుసంక్రాంతికి అలవైకుంఠపురంలో సినిమా సక్సెస్ వచ్చింది. ఈ సారి బంగార్రాజుతో మరో హిట్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చాలా ఆనందంగా వుంది. ఈ పాత్ర ఇచ్చిన నాగార్జున గారికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.
టెక్నికల్ టీమ్ జునైద్ మాట్లాడుతూ, వీఎప్.ఎక్స్ వంటివి కథప్రకారం చేశాను. ముందుగా దర్శకుడితో కథలో కూర్చుని అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని చేయబట్టే గ్రాఫిక్స్ విజువల్‌కు మంచి పేరు వచ్చింది అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments