సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వివాదం.. నాగ్ కి అసహనం కలిగిన వేళ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'ట్రైలర్ మంచి అటెన్షన్ తీసుకుంది. ముఖ్యంగా సమంత రోల్ సౌత్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సమంత ఈ చిత్రంలో టెర్రరిస్ట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జూన్ 4న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కానీ తమిళనాడులో ఈ వెబ్ సిరీస్ పై వివాదం రాజుకుంది. ముఖ్యంగా సమంత పాత్రపై తమిళులు సీరియస్ గా ఉన్నారు.తమ మనోభావాలు కించపరిచే విధంగా సమంత పాత్రని డిజైన్ చేసినట్లు కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం పొలిటికల్ గా కూడా టర్న్ తీసుకుంటోంది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అది ఆగిపోయినట్లే ?
తమిళనాడు రాజ్యసభ ఎంపీ వైకో కేంద్ర ఐ అండ్ బి మినిస్ట్రీకి లేఖ రాశారు. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ నిపిలివేయాలని కోరారు. సమంతని పాయింట్ అవుట్ చేసేలా వివాదం ముదురుతుండడంతో నాగార్జున తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సహజంగా నాగ్ వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తే మాత్రం ఆయన రెస్పాండ్ అవుతారని అంటున్నారు. సమంత ఈ వెబ్ సిరీస్ లో తన వంతుగా నటించింది. అంతకు మించి ఆమెకు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ సామ్ ని టార్గెట్ చేయడంపై నాగ్ సీరియస్ అయ్యారట.
ఇప్పటికే వెబ్ సిరీస్ మేకర్స్ రాజ్, డీకే వివరణ ఇచ్చారు. కేవలం ట్రైలర్ లో కొన్ని షాట్స్ చూసి వివాదం మొదలెడితే ఎలా అని ప్రశ్నించారు. వెబ్ సిరీస్ ఎవరి మనోభావాలు కించపరిచే విధంగా ఉండదని హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments