చైతు, అఖిల్ పెళ్లి గురించి స్పందించిన నాగ్..!
- IndiaGlitz, [Tuesday,September 06 2016]
చైతన్య, అఖిల్...పెళ్లిల గురించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తల పై గతంలో స్పందించిన నాగార్జున తాజాగా మరోసారి స్పందించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మలా కాన్వెంట్ సినిమా గురించి ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నాగార్జున కుమారుల పెళ్లిల గురించి స్పందించారు. ఇంతకీ నాగ్ ఏమన్నారంటే... అఖిల్, చైతన్య పెళ్లి అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందుచేత వారి పెళ్లి గురించి చెప్పడానికి త్వరలో ఓ ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అని తెలియచేసారు. అలాగే సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో బంగార్రాజు అనే సినిమా చేయనున్నాను. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు.