close
Choose your channels

అఖిల్, వర్మ సినిమాపై స్పందించిన నాగార్జున‌

Thursday, May 31, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అఖిల్, వర్మ సినిమాపై స్పందించిన నాగార్జున‌

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌కు ‘అఖిల్’, ‘హలో’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. అందుకే తదుపరి చిత్రాన్ని ‘తొలిప్రేమ’ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నారు. కాగా.. జూన్ మూడో వారం నుంచి ఈ సినిమా నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. అఖిల్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేసారు.

అయితే.. దీనికి సంబంధించి ఇటు అఖిల్ గాని, అటు నాగ్ గాని ఎప్పుడూ స్పందించలేదు. దీంతో ఈ విషయమై నాగ్‌ను ప్రశ్నించగా.. ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఇంకా చర్చించుకుంటున్నారనీ.. అవి ఫ్రూట్‌ఫుల్ అయ్యాక చూద్దామని సమాధానం ఇచ్చారు. వర్మ చేసిన ట్వీట్ సంగతి అడిగితే.. “అది చేసింది వర్మ గాని, నేను కాదు కదా” అని నాగ్ అన్నారు. దీంతో అఖిల్, వర్మ సినిమా ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నాగార్జున ప్రధాన పాత్రలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్’ మూవీ జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment