సమంత-నాగచైతన్య విడాకులపై నేనేం మాట్లాడలేదు.. అదంతా అవాస్తవం: నాగార్జున ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత-నాగచైతన్యల విడాకులకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున స్పష్టం చేశారు. తొలుత సమంతనే విడాకులు కావాలని కోరిందంటూ ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పారని గురువారం ఉదయం నుంచి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. నాగచైతన్య-సమంత గురించి నేను మాట్లాడినట్లు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవన్నీ అవాస్తవం. దయచేసి అబద్ధాలను ఎవరూ ప్రసారం చేయొద్దు.. పుకార్లను వార్తలుగా మల్చవద్దని మీడియాను నాగార్జున ట్విట్టర్ ద్వారా కోరారు.
కాగా.. ఓ ఇంటర్వ్యూలో సమంతా- నాగచైతన్య విడాకులపై నాగార్జున స్పందించినట్లుగా వార్తలు వచ్చాయి. దాని ప్రకారం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని ఆయన పేర్కొన్నారు అయితే నాలుగేళ్ల వివాహ బంధంలో వాళ్లకు విడిపోయేటంత పెద్ద సమస్య ఎందుకొచ్చింది అనేది తనకు తెలియదని నాగార్జున చెప్పారు. గతేడాది (2021) న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారని.. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్యా ఏదో సమస్య వచ్చిందని నాగ్ వివరించినట్లుగా ఆ కథనాల్లో వుంది.
సమంతనే తొలుత విడాకులు కావాలని కోరిందని, ఆమె కోరిక మేరకే చైతన్య అంగీకరించాడని నాగార్జున చెప్పారంటూ వస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. కాగా.. నాగ చైతన్య- సమంత విడాకుల ప్రకటన తర్వాత తమ కుటుంబంపై వచ్చిన వార్తలు తమను ఎంతగానో బాధించాయని నాగార్జున ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com