బాలయ్య స్థానంలో నాగార్జున..!
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నాగశౌర్య చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఒక వైపు లక్ష్య, వరుడు కావాలెను చిత్రాలతో పాటు తన బ్యానర్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా ఆయన బ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి శౌర్య ఓకే చెప్పాడట. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో బాలకృష్ణ నటించనని చెప్పేశాడట. దీంతో నిర్మాతలు ఆ పాత్రలో నాగార్జున అక్కినేనిని నటింప చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. మరి నాగార్జున అతిథి పాత్రలో నటించడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఈ చిత్రంలో నాగశౌర్య మాటలు మాట్లాడలేని, చెవులు వినిపించని యువకుడి పాత్రలో కనిపిస్తాడట. ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేముల అనే దర్శకుడు తెరకెక్కించనున్నాడని టాక్.
గత ఏడాది నాగశౌర్యకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే అటు నటుడిగా, ఇటు నిర్మాతగా నాగశౌర్యకు హిట్ లేదు. సమంత టైటిల్ పాత్రలో నటించిన `ఓబేబీ` చిత్రంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఫలితం శౌర్యకు కాస్త ఊరటనిచ్చింది. ఇక 2020లో ఏ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో నాగశౌర్య ఆశలన్నీ 2021పైనే ఉన్నాయి. చేస్తున్న నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందనేది తెలియాలంటే వెయిటింగ్ తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com