అదే సీన్ రిపీట్ చేస్తున్న నాగ్‌...!

  • IndiaGlitz, [Tuesday,October 06 2020]

కింగ్ నాగార్జున‌.. ఒక‌వైపు సినిమాలు, మ‌రో వైపు బిగ్‌బాస్ షోతో బిజీ బిజీగా ఉంటున్నాడు. స్టార్ హీరోస్‌లో ముందుగా షూటింగ్‌ను స్టార్ట్ చేసింది కూడా నాగార్జునే. దీంతో ఇత‌ర హీరోలు కూడా వారి షూటింగ్స్‌ను ట్రాక్ ఎక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున గోవాలో వైల్డ్ డాగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దీని త‌ర్వాత థాయ్‌లాండ్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. రెండు వారాల పాటు షూటింగ్ ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజ‌ముంటే.. బిగ్‌బాస్ 4లో రెండు వారాల పాటు నాగార్జున క‌నిపించే ఆస్కారం లేద‌ని అంటున్నారు. నిజానికి బిగ్‌బాస్ సీజ‌న్ 3లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇందులో మూడు వారాల పాటు నాగార్జున షూటింగ్‌తో బిజీగా ఉంటే ర‌మ్య‌కృష్ణ .. హోస్ట్‌గా వ్వ‌వ‌హ‌రించారు. ఇప్పుడు మ‌రోసారి నాగ్ షూటింగ్‌తో బిజీగా మారితే ఎవ‌రు హోస్ట్ చేస్తార‌నేది టాప్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

‘వైల్డ్‌డాగ్’ విష‌యానికి వ‌స్తే ఈ చిత్రంలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. సాల్మోన్ అహిషోర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

‘వకీల్‌సాబ్’ అప్పుడేనా?

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’.

బాల‌య్య కూడా రెడీ అన్నాడా..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

జనసేనానిని కలిసిన సుదీప్.. ఆసక్తికర విషయం ఏంటంటే..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారితో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు.

వైద్యుల మాట వినకుండానే ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారట..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చికిత్స పొందుతున్న వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

థియేటర్స్ కు కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు...

కోవిడ్‌ ప్రభావంతో సినిమా రంగం కుదేలైంది. ఆరు నెలలు థియేటర్స్‌ మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.