నాగ్ ఇప్పుడు 5 పెంచాడట
- IndiaGlitz, [Sunday,July 07 2019]
అక్కినేని అందగాడు నాగార్జున గతంలో 7 తీసుకుంటే, ఇప్పుడు 5 పెంచి మొత్తం పన్నెండు తీసుకుంటున్నాడట. బుల్లితెరమీద కనిపించడానికి ఇంత మొత్తమా? అయినా అంత క్రేజా? అని నోళ్లు నొక్కుకోవడం సామాన్యుల వంతు అవుతోంది. నాగ్ హోస్ట్ గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన 'బిగ్ బాస్3'కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 100 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఆయన ఎపిసోడ్‌కు 12 లక్షల చొప్పున తీసుకోనున్నారు. సో దీన్ని బట్టి ఆయన మొత్తం ఆదాయం ఎన్ని కోట్లో సులభంగానే లెక్క కట్టవచ్చు. బిగ్‌బాస్ తొలి షో నిర్వహించిన తారక్ అందులో కృతకృత్యులయ్యారు.
నాని మాత్రం బిగ్ బాస్ తనకు జీవితాన్ని మరోసారి నేర్పించిందని బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు నాగార్జున ఎలాంటి అనుభూతిని వ్యక్తం చేస్తారో వేచి చూడాలి. రెమ్యునరేషన్ మాత్రం భారీగానే డిమాండ్ చేశారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.