కింగ్ నాగార్జున విడుదల చేస్తున్న హీరో తరుణ్ 'ఇది నా లవ్ స్టోరీ' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా లవ్‌స్టోరీ`. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల తుది దశకు చేరుకుంది. ఈ సినిమా టీజర్ విడుదలను రేపు సాయంత్రం కింగ్ నాగార్జున విడుదల చేస్తున్నారు.
కన్నడంలో సూపర్‌హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో `ఇది నా లవ్‌స్టోరీ` అనే పేరుతో రీమేక్ చేశాం. ఒక అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయిని ఎంత ప్రేమించాడనేదే సినిమా కాన్సెప్ట్. తెలుగు ఆడియెన్స్ టెస్ట్‌కు తగిన విధంగా, నెటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేర్పులు చేశాం. అవుటండ్ అవుట్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. తరుణ్, ఓవియా అద్భుతంగా నటించారు. ఈ సినిమా టీజర్‌ను కింగ్ నాగార్జున రేపు విడుదల చేస్తున్నారు. మా టీంకు నాగార్జున వంటి స్టార్ హీరో ఆశీస్సులు అందించడం అదృష్టంగా భావిస్తున్నాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com