కొత్త టైటిల్ రిజిష్టర్ చేసిన నాగ్..

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. సంక్రాంతికి రిలీజైన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం నాగ్ కెరీర్ లోనే నెం 1 చిత్రంగా నిలిచింది. అంతే కాదు టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే లిమిటెడ్ బ‌ట్జెడ్ తో తెర‌కెక్కి బ్లాక్ బ‌ష్ట‌ర్ గా నిలిచిన చిత్రాల్లో నెం 1 గా నిలిచింది. ఈ చిత్రంలో నాగ్ పోషించిన బంగార్రాజు పాత్ర సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. అందుక‌నే సోగ్గాడే చిన్ని నాయనా కి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బంగార్రాజు అనే టైటిల్ ఫిక్స్ చేసారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేసారు. వ‌చ్చే సంక్రాంతికి బంగార్రాజు ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. సోగ్గాడు చిన్ని నాయ‌నా డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.