హ‌ర్ర‌ర్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నాగ్..!

  • IndiaGlitz, [Monday,October 10 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున ప్ర‌స్తుతం ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కిస్తున్న ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం మ‌హాబ‌లేశ్వ‌రంలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నారు అనే విష‌యం పై ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటితో సినిమా చేయ‌నున్నారు అని కొన్ని రోజులు ప్ర‌చారం జ‌రిగింది.

ఆత‌ర్వాత మ‌ల‌యాళ చిత్రం ఒప్ప‌మ్ రీమేక్ లో న‌టించ‌నున్నారు అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏమిటంటే...ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌ర్ర‌ర్ మూవీ రాజు గారి గ‌ది. ఈ మూవీ సీక్వెల్ లో నాగ్ న‌టించ‌నున్నారు అని తెలిసింది. ఈ మూవీలో వెంక‌టేష్ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే...క‌థ న‌చ్చి నాగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంద‌ని స‌మాచారం. ఇదే క‌నుక నిజ‌మైతే...నాగ్ కెరీర్ లో మ‌రో డిఫ‌రెంట్ మూవీగా నిల‌వ‌డం ఖాయం..!