నాగ్ షురూ చేశాడు
Tuesday, March 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డి సినిమాల పేర్లు చెప్పగానే అందరికీ కాంబినేషన్ గుర్తుకొస్తుంది. వారిద్దరే అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు. వారిద్దరు కలిసి ఇప్పుడు మరో సినిమాకు పనిచేయనున్నారు. వేంకటేశ్వర స్వామి భక్తుడు హాతీరామ్ బాబా కథతో ఓ సినిమాను రూపొందించనున్నారు.
హాతీరామ్ బాబాగా నాగార్జున నటిస్తారు. ఈ సినిమాకు సంబంధించి కె.రాఘవేంద్రరావు సంగీత చర్చలను మొదలుపెట్టారు. మహా శివరాత్రి సందర్భంగా కీరవాణి ఈ సినిమా సంగీత చర్చలను తిరుపతిలో ప్రారంభించారు. వైష్ణవ భక్తుడి కథకు శివరాత్రి రోజు సంగీత చర్చలను మొదలుపెట్టడం శివకేశవ అభేదానికి ప్రతీకగా భావించవచ్చని విజ్ఞులు అంటున్నారు. త్వరలోనే షూటింగ్‌ను మొదలుపెట్టే తేదీని వెల్లడించనున్నట్టు రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments