నాగ్ షురూ చేశాడు

  • IndiaGlitz, [Tuesday,March 08 2016]

అన్న‌మయ్య‌, శ్రీరామ‌దాసు, షిర్డి సినిమాల పేర్లు చెప్ప‌గానే అంద‌రికీ కాంబినేష‌న్ గుర్తుకొస్తుంది. వారిద్ద‌రే అక్కినేని నాగార్జున‌, రాఘ‌వేంద్ర‌రావు. వారిద్ద‌రు క‌లిసి ఇప్పుడు మ‌రో సినిమాకు ప‌నిచేయ‌నున్నారు. వేంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడు హాతీరామ్ బాబా క‌థ‌తో ఓ సినిమాను రూపొందించ‌నున్నారు.
హాతీరామ్ బాబాగా నాగార్జున న‌టిస్తారు. ఈ సినిమాకు సంబంధించి కె.రాఘ‌వేంద్ర‌రావు సంగీత చ‌ర్చ‌ల‌ను మొద‌లుపెట్టారు. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా కీర‌వాణి ఈ సినిమా సంగీత చ‌ర్చ‌ల‌ను తిరుప‌తిలో ప్రారంభించారు. వైష్ణ‌వ భ‌క్తుడి క‌థ‌కు శివ‌రాత్రి రోజు సంగీత చ‌ర్చ‌ల‌ను మొద‌లుపెట్ట‌డం శివ‌కేశ‌వ అభేదానికి ప్ర‌తీక‌గా భావించ‌వ‌చ్చ‌ని విజ్ఞులు అంటున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్‌ను మొద‌లుపెట్టే తేదీని వెల్ల‌డించ‌నున్న‌ట్టు రాఘ‌వేంద్ర‌రావు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

More News

మారుతి కొత్త కోరిక‌

మారుతి పేరు చెప్ప‌గానే అంచ‌లంచ‌లుగా ఎదిగిన ద‌ర్శ‌కుడు అనే మాట చ‌టుక్కున గుర్తుకొస్తుంది. సినిమాల్లోకి రాక‌ముందు యానిమేట‌ర్‌గా ప‌నిచేశారు మారుతి. ఆయ‌న‌కు ఆ అనుభ‌వం సినిమాల్లోనూ ఉప‌యోగ‌ప‌డింది.

18న దండ‌కార‌ణ్యం

మ‌న దేశంలో దాదాపు 12, 13 రాష్ట్రాల‌ను ఆనుకుని ఉన్న ప్రాంతానికి దండ‌కార‌ణ్యం అని పేరు. అక్క‌డ ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డానికి ఆదివాసులు తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. అందులో భాగంగానే మార‌ణ‌హోమాల్లో ప్ర‌మిద‌ల‌వుతున్నారు.

రీబాక్ బ్రాండ్ అంబాసిడర్ గా క్వీన్...

బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతుంది.

రజనీకాంత్ కు కోర్టు సమన్లు..

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన చిత్రం లింగా.

కోలీవుడ్ లో టెంపర్

దయా పాత్రలో ఎన్టీఆర్ నటించిన సినిమా టెంపర్.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ నటించింది.