అన్నమయ్య కాంబినేషన్లో ఓం నమో వెంకటేశాయ..

  • IndiaGlitz, [Saturday,February 27 2016]

నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన అధ్యాత్మిక అద్భుతం అన్న‌మ‌య్య‌. తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ సంచ‌ల‌న చిత్రంగా అన్న‌మ‌య్య నిలిచిన విష‌యం తెలిసిందే. నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో అన్న‌మ‌య్య త‌ర్వాత శ్రీరామ‌దాసు, శిరిడి సాయి చిత్రాలు రూపొందాయి. మూడు భ‌క్తిర‌స చిత్రాల‌ను రూపొందించిన ఈ కాంబినేష‌న్ నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం చేయ‌డానికి శ్రీకారం చుట్టారు.

ఈసారి వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడు హ‌తిరామ్ బాబా జీవిత చ‌రిత్రను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ చిత్రానికి ఓం న‌మో వెంక‌టేశాయ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున హ‌తిరామ్ బాబాగా న‌టిస్తుంటే...వెంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర కోసం అన్న‌మ‌య్య‌లో వెంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర పోషించిన సుమ‌న్ నే సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. ఈ స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అన్న‌మ‌య్య కాంబినేష‌న్లో రూపొంద‌నున్న ఈ చిత్రం కూడా అధ్యాత్మిక అద్భుత చిత్రంగా నిలుస్తుంద‌ని ఆశిద్దాం.