'ప్రెసిడెంటుగారి పెళ్ళాం'కి 25 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జునకి కెరీర్ ఆరంభంలో.. మాస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చిత్రం ప్రెసిడెంటుగారి పెళ్లాం. సెన్సేషనల్ హిట్ మూవీ శివ తరువాత సరైన విజయం లేని నాగ్‌కి.. ఆ లోటుని తీర్చింది ఈ సినిమా. సీతారామయ్యగారి మనవరాలు, చంటి, అల్లరి మొగుడు, సుందరకాండ చిత్రాలతో అప్పటికే మంచి స్వింగ్‌లో ఉన్న మీనా.. ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో సందడి చేసింది. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పాటలన్నీ కూడా ప్రజాదరణ పొందాయి.
వి.ఎం.సి.ప్రొడక్షన్స్ పతాకంపై వి.దొరస్వామిరాజు నిర్మించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, సత్యనారాయణ, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, అన్నపూర్ణ, సుధ, హరిత ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. వి.ఎస్.ఆర్.స్వామి ఛాయాగ్రహణం అందించిన ఈ సినిమాకి.. ఎ.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. భాస్కరరాజు కళా దర్శకత్వం వహించారు. 30 అక్టోబర్, 1992న విడుదలైన ప్రెసిడెంటుగారి పెళ్ళాం.. ఇవాళ్టితో 25 సంవత్సరాలను పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com