నాగ్ ఊపిరి ఆడియో డేట్..

  • IndiaGlitz, [Friday,February 26 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ మూవీ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఊపిరి టీజ‌ర్ కు మంచి స్పంద‌న ల‌భించ‌డంతో సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది.

గోపీ సుంద‌ర్ సంగీతాన్నిఅందించిన ఊపిరి త‌మిళ వెర్షెన్ ఆడియోను ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు చెన్నైలో రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఊపిరి ఆడియోను మార్చి 1న హైద‌రాబాద్ నోవాటెల్ హాట‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ భారీ క్రేజీ మూవీ ఊపిరి ని తెలుగు, త‌మిళ్ లో మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.