బాలయ్యతో గొడవలేం లేవు - నాగార్జున
- IndiaGlitz, [Sunday,April 09 2017]
నందమూరి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున వారి నట వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మూడు దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా రాణిస్తున్న వీరిద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని, అందుకే ఇద్దురూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. జరుగుతున్న పరిస్థితులు కూడా ఈ వార్తలకు బలాన్నిస్తూ వచ్చాయి.
అయితే ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని నాగార్జున విశాఖపట్నంలో జరిగిన టి.ఎస్.ఆర్- టి.వి9 అవార్డ్స్ వేదికపై చెప్పుకొచ్చారు. బాలకృష్ణ, నాగార్జున వేదికపై కరచాలనం ఇచ్చుకోవడమే కాకుండా ఒకరికి వచ్చిన అవార్డులను మరొకరికి అందజేసుకున్నారు. ఇలా ఇద్దరు అగ్ర కథానాయకులు ఒక్కటవ్వడం వారి అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ కార్యక్రమంలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.