చైతు మూవీ గురించి నాగ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో...ఈ రెండు చిత్రాలతో వరుస విజయాలు సాధించిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ రష్ ను నాగార్జున ఇటీవల చూసారట. నాగ్ బాగా వచ్చిందని చెప్పడంతో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. తదుపరి షెడ్యూల్ విశాఖలో రెండు వారాలు పాటు జరగనుందని సమాచారం. ఈ చిత్రం నిన్నే పెళ్లాడతా తరహాలో ఉంటుంది. అందుచేత ఈ చిత్రానికి టైటిల్ నిన్నే పెళ్లాడతా అంటూ ప్రచారం జరిగింది కానీ...నాగ్ ఆ టైటిల్ వద్దు అని చెప్పడంతో కళ్యాణ్ కృష్ణ వేరే టైటిల్ కోసం ఆలోచిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంటే....జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com