నాగ్ , తారక్ , రవితేజ..ముగ్గురికీ ఒకేలా..

  • IndiaGlitz, [Sunday,September 17 2017]

సెప్టెంబ‌ర్ 21 నుంచి అక్టోబ‌ర్ 13 వ‌ర‌కు.. అంటే 23 రోజులలో నాలుగు పెద్ద సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఆ నాలుగు చిత్రాలే జైల‌వ‌కుశ (ఎన్టీఆర్ హీరో), స్పైడ‌ర్ (మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడు), రాజా ది గ్రేట్ (ర‌వితేజ క‌థానాయ‌కుడు), రాజు గారి గ‌ది2 (నాగార్జున హీరో). వీటిలో స్పైడ‌ర్ చిత్రాన్ని మిన‌హాయిస్తే..మిగిలిన మూడు చిత్రాల‌కు ఓ కామ‌న్ పాయింట్ ఉంది. అదేమిటంటే.. ఆయా చిత్రాలు ద‌ర్శ‌కులకి మూడో సినిమాలు కావ‌డం.

ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ల త‌రువాత బాబీ త‌న మూడో చిత్రాన్ని జైల‌వ‌కుశ‌గా తెర‌కెక్కిస్తే.. ప‌టాస్‌, సుప్రీమ్ త‌రువాత త‌న మూడో చిత్రాన్ని రాజా ది గ్రేట్‌గా తెర‌కెక్కించాడు అనిల్ రావిపూడి. ఇక జీనియ‌స్‌, రాజు గారి గ‌ది త‌రువాత త‌న మూడో చిత్రాన్ని రాజు గారి గ‌ది 2గా తెర‌కెక్కిస్తున్నాడు మ‌రో ద‌ర్శ‌కుడు ఓంకార్‌. మొత్తానికి నాగ్‌, తార‌క్‌, ర‌వితేజ‌.. ఈ ముగ్గురు అగ్ర క‌థానాయ‌కుల‌కి కొత్త చిత్రాల విష‌యంలో ఒకే ప‌రిస్థితి ఉంద‌న్న‌మాట‌.

More News

అనిల్ రావిపూడి కొనసాగిస్తాడా?

ఇప్పటి దర్శకులంతా రెండు లేదా మూడేళ్ల కో సినిమా అన్నట్లుగానే..

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గల్ఫ్'

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన 'గల్ఫ్' చిత్రం ఆక్టోబరులో విడుదలకి సిద్ధం అవుతోంది.'గల్ఫ్'

సునీల్ 'సైరా'

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమా చిత్రీకరణకు సిద్ధమవుతోంది.

'మిస్టర్ పర్ ఫెక్ట్' ... దిల్ రాజుపై కేసు నమోదు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ హిట్ చిత్రాల నిర్మాత గా పేరు తెచ్చుకున్నారు దిల్రాజు.

'సాహో' లో మరో హీరోయిన్ ఎవరు?

బాహుబలి ప్రభాస్ సినిమాలంటే ఇప్పుడు ఇండియా అంతా మంచి క్రేజ్ నెలకొంది.