నాగార్జున సినిమాలో హీరోయిన్....
Send us your feedback to audioarticles@vaarta.com
మనం, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరస విజయాలతో సక్సెస్ ట్రాక్‌లో ఉన్న అక్కినేని నాగార్జున ఇప్పుడు `రాజుగారి గది 2` చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా లాంచనంగా ప్రారంభమైంది. పివిపి సినిమా, ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రూపొందనున్న రాజుగారి గది2 చిత్రాన్ని ఓంకార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒక హీరోయిన్‌గా శీరత్‌కపూర్ ఓకే అయ్యిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రస్తుతం చిత్రయూనిట్ శీరత్‌తో తుది దశ చర్చలు జరుపుతున్నారట. ఈ చిత్రంలో నాగార్జున మనుషులతో ఆడుకునే ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మరి శీరత్ పాత్ర ఎలా ఉంటుందో, రాజుగారి గది2 నటించబోయే మరో హీరోయిన్ ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com