ఆ డైరెక్టర్ తో మరో మూవీ చేయనున్ననాగ్..

  • IndiaGlitz, [Tuesday,March 29 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవ‌ల ఓ మూవీ చేసిన డైరెక్ట‌ర్ తో మ‌రో మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇంత‌కీ..ఆ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఎవ‌రో కాదు వంశీ పైడిప‌ల్లి. నాగార్జున తో వంశీ పైడిప‌ల్లి ఊపిరి చిత్రం చేయ‌డం...ఫీల్ గుడ్ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమా రికార్డ్ స్ధాయి కలెక్ష‌న్స్ సాధిస్తున్న విష‌యం తెలిసిందే. వంశీ వ‌ర్కింగ్ స్టైల్ న‌చ్చి అఖిల్ తో సినిమా చేసే అవ‌కాశం ఇచ్చారు నాగ్.
అఖిల్ హీరోగా వంశీ తెర‌కెక్కించే చిత్రం త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున - పి.వి.పి సంయుక్తంగా నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా త‌ర్వాత నాగార్జున వంశీ డైరెక్ష‌న్లో మ‌రో సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని కూడా పి.వి.పి సంస్థ నిర్మించ‌నుంది. ఈ విష‌యాన్నిస్వ‌యంగా నాగార్జున - పి.వి.పి ప్ర‌క‌టించ‌డం విశేషం. మ‌రి..ఈసారి వంశీ ఎలాంటి క‌థ‌ను ఎంచుకుంటాడో..? నాగ్ ని ఎలా చూపిస్తాడో..?