ఆ డైరెక్టర్ తో మరో మూవీ చేయనున్ననాగ్..
Tuesday, March 29, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల ఓ మూవీ చేసిన డైరెక్టర్ తో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకీ..ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు వంశీ పైడిపల్లి. నాగార్జున తో వంశీ పైడిపల్లి ఊపిరి చిత్రం చేయడం...ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధిస్తున్న విషయం తెలిసిందే. వంశీ వర్కింగ్ స్టైల్ నచ్చి అఖిల్ తో సినిమా చేసే అవకాశం ఇచ్చారు నాగ్.
అఖిల్ హీరోగా వంశీ తెరకెక్కించే చిత్రం త్వరలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున - పి.వి.పి సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత నాగార్జున వంశీ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని కూడా పి.వి.పి సంస్థ నిర్మించనుంది. ఈ విషయాన్నిస్వయంగా నాగార్జున - పి.వి.పి ప్రకటించడం విశేషం. మరి..ఈసారి వంశీ ఎలాంటి కథను ఎంచుకుంటాడో..? నాగ్ ని ఎలా చూపిస్తాడో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments