విరామమే లేకుండా నాగ్ , నాని చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. పూర్తిగా హాస్యప్రధానంగా సాగే ఈ చిత్రంలో నాగార్జున, నాని పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర బృందం తెలియజేస్తోంది. ఇదిలా ఉంటే.. నాని పుట్టినరోజున పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం.. ఉగాది పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లో లాంఛనంగా షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది.
ప్రస్తుతం నాగార్జున ఆఫీసర్` మూవీతో, నాని కృష్ణార్జున యుద్ధం` చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత తొందరగా వీటిని పూర్తిచేసుకుని.. విరామమే లేకుండా ఈ మల్టీస్టారర్ మూవీ చిత్రీకరణలో పాల్గోవాలని ఈ ఇద్దరు హీరోలు నిర్ణయించుకున్నారని తెలిసింది. అంతేగాకుండా.. ఆగష్టు కల్లా చిత్రీకరణను పూర్తిచేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నాగ్ సరసన అమలా పాల్, నానికు జంటగా శ్రద్ధా శ్రీనాథ్ నటించనున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments