నాగ్‌, నాని సినిమాలో ట్విస్ట్ అదేన‌ట‌

  • IndiaGlitz, [Thursday,April 19 2018]

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ పతాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఇప్పటికే తొలిషెడ్యూల్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జ‌రుగుతోంది.

అంతేగాకుండా.. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఒక హాస్పిటల్ సెట్ వేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అత్యధిక భాగం ఇక్కడే చిత్రీకరించనున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి క‌థ‌లో కీల‌క‌మైన  ట్విస్ట్  గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే.. ఈ చిత్రంలో డాన్ పాత్రలో నాగ్ సందడి చేయనుండగా.. డాక్టర్‌గా నాని కనిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని చంపాలనుకుని హాస్పిటల్‌కి వస్తాడు నాగ్. కాని ఆ వ్యక్తి అక్కడ క్రిటికల్ కండిషన్‌లో ఉన్న పేషెంట్ అని తెలుసుకుని.. పూర్తిగా కోలుకున్న తర్వాతే చంపాలని ఫిక్స్ అవుతాడు. అయితే.. ఆ పేషెంట్‌కి ట్రీట్‌మెంట్ చేస్తోంది నాని అని తెలుసుకుని.. నానితో స్నేహం చేస్తాడు నాగ్‌. ఇంటర్వెల్ దగ్గర అసలు విషయం బయట పడుతుంది. అయితే నాగ్ ఆ వ్యక్తిని ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు కథ ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం ఆగష్టు వరకు ఆగాల్సిందే.

More News

'భరత్ అనే నేను' కోసం 25 ఏళ్ళ త‌రువాత..

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘జంబలకిడి పంబ’ (1993) సినిమాతో టాలీవుడ్‌కు నిర్మాతలుగా పరిచయమయ్యారు డి.వి.వి.దానయ్య,

అమితాబ్ పాత్ర‌ను పెంచే ఆలోచ‌న‌లో చిరు?

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంట‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’.

'మహానటి' లో స‌మంత‌కి న‌త్తి ఉందా?

న‌టీమ‌ణి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’.

రామ్ చరణ్ కోసం బాలీవుడ్‌ ఫిట్‌నెస్ ట్రైనర్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో

తార‌క్ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కొడుకుగా..

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు నవీన్ చంద్ర.