నాగ్, నాని సినిమాలో ట్విస్ట్ అదేనట
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఇప్పటికే తొలిషెడ్యూల్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది.
అంతేగాకుండా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఒక హాస్పిటల్ సెట్ వేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అత్యధిక భాగం ఇక్కడే చిత్రీకరించనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి కథలో కీలకమైన ట్విస్ట్ గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే.. ఈ చిత్రంలో డాన్ పాత్రలో నాగ్ సందడి చేయనుండగా.. డాక్టర్‌గా నాని కనిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని చంపాలనుకుని హాస్పిటల్‌కి వస్తాడు నాగ్. కాని ఆ వ్యక్తి అక్కడ క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్ అని తెలుసుకుని.. పూర్తిగా కోలుకున్న తర్వాతే చంపాలని ఫిక్స్ అవుతాడు. అయితే.. ఆ పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేస్తోంది నాని అని తెలుసుకుని.. నానితో స్నేహం చేస్తాడు నాగ్. ఇంటర్వెల్ దగ్గర అసలు విషయం బయట పడుతుంది. అయితే నాగ్ ఆ వ్యక్తిని ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు కథ ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం ఆగష్టు వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments