నాగ్ , నాని మూవీలో కన్నడ నటి

  • IndiaGlitz, [Thursday,February 15 2018]

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి భలే మంచి రోజు' దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. డాక్టర్ పాత్రలో నాని కనిపించనుండగా...ఇందుకు పూర్తి విరుద్ధంగా డాన్ పాత్రను చేయబోతున్నారు నాగార్జున. ఈ రెండు పాత్రల మ‌ధ్య సాగే హిలేరియస్ కామెడీ నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ నెల‌ 24 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థాన‌ముంది. వారిలో ఒక‌రిగా కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ పేరు వినిపిస్తోంది. తమిళ సినిమా విక్రమ్ వేద', కన్నడ ఫిలిం యు టర్న్' సినిమాలు ఈ ముద్దుగుమ్మ‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలో కూడా త‌న‌ పాత్రకి ప్రాధాన్య‌ముండ‌డంతో.. శ్ర‌ద్ధా కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలిసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ‌ ఆది హీరోగా న‌టిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అలాగే...వర్మ సినిమాతో నాగార్జున బిజీగా ఉంటే.. కృష్ణార్జున యుద్ధం' పోస్ట్ ప్రొడక్షన్ పనులతో నాని బిజీగా ఉన్నారు.

More News

'సైరా నరసింహారెడ్డి' కొత్త షెడ్యూల్ అప్ డేట్

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'కొత్తగా ఉన్నాడు' ఆడియో వేడుక

తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అందాల కథానాయకుడు ఆకాష్ తాజాగా తెలుగులో నటించిన చిత్రం `కొత్తగా ఉన్నాడు'.

సైకలాజికల్ లవ్ స్టోరీగా మసక్కలి

కొన్ని కథలు విని నమ్ముతాం..కొన్ని కథలు చూసి నమ్ముతాం..మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి..

'47 డేస్' ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేసిన పూరి

ప్రదీప్ మద్దాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా '47 డేస్'..  "ది మిస్టరీ అన్ ఫోల్డ్స్" అనేది ట్యాగ్ లైన్..సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ నుండి "క్యా కరూన్" అని సాగే మొదటి పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు..రఘు కుంచె స్వరపరచి

'తొలి ప్రేమ‌' స‌క్సెస్ మీట్‌

బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన సినిమా 'తొలి ప్రేమ‌'. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమా థాంక్స్ మీట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.