నాగ్ , నాని మూవీలో కన్నడ నటి
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి భలే మంచి రోజు` దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. డాక్టర్ పాత్రలో నాని కనిపించనుండగా...ఇందుకు పూర్తి విరుద్ధంగా డాన్ పాత్రను చేయబోతున్నారు నాగార్జున. ఈ రెండు పాత్రల మధ్య సాగే హిలేరియస్ కామెడీ నేపథ్యంలో సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ నెల 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానముంది. వారిలో ఒకరిగా కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ పేరు వినిపిస్తోంది. తమిళ సినిమా విక్రమ్ వేద`, కన్నడ ఫిలిం యు టర్న్` సినిమాలు ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలో కూడా తన పాత్రకి ప్రాధాన్యముండడంతో.. శ్రద్ధా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆది హీరోగా నటిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అలాగే...వర్మ సినిమాతో నాగార్జున బిజీగా ఉంటే.. కృష్ణార్జున యుద్ధం` పోస్ట్ ప్రొడక్షన్ పనులతో నాని బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments