నాగ్‌, నాని.. డేట్ ఫిక్స‌య్యింది

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్లీస్టార‌ర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న‌ ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపించనుండగా...నాని డాక్టర్ పాత్రలో మెప్పించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని భ‌లే మంచి రోజు, శమంత‌క‌మ‌ణి చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించ‌నున్నారు.

ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాత‌గా వ్య‌వ‌హరించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఫిబ్రవరి 24 నుంచి ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలిసింది. ప్రస్తుతం నాని నటిస్తున్న 'కృష్ణార్జున యుద్ధం', అలాగే నాగ్, వర్మల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం.. అప్పటికి క్లైమాక్స్ దశకు చేరుకుంటాయి. ఆ పైన వీరిద్దరూ ఈ మల్టీ స్టారర్‌లో నటించనున్నారని తెలుస్తోంది.

ఇదిలా వుంటే...గతంలో అశ్వినీ దత్, నాగార్జున కలయికలో 'ఆఖరి పోరాటం', 'గోవిందా గోవింద', 'రావోయి చందమామ', 'ఆజాద్' సినిమాలు రాగా... అశ్వినీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న‌.. నానితో 'ఎవడే సుబ్రహ్మణ్యం' మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే.

More News

ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా అనసూయ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న గాయత్రి చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. సంక్రాంతికి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా, 'రాయలసీమ రామన్న చౌదరి' తరహాలో మోహన్ బాబు ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించనుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

బన్ని సినిమా ముందుకా? వెనక్కా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేసవిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.

అడివిశేష్ , శివాని జంటగా ఫిబ్రవరిలో కొత్త చిత్రం ప్రారంభం

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అడివి శేష్ హీరోగా ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో

నిఖిల్ 'కిరాక్ పార్టీ' తొలి పాట‌... విడుద‌ల‌

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న 15వ చిత్రం 'కిరాక్ పార్టీ'.  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఏ టీవీ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై  రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర

సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్' ఫస్ట్ లుక్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై