నాగ్, నాని కెమిస్ట్రీనే ఓ స్పెషల్ ఎట్రాక్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల (ఫిబ్రవరి 24న) మహతి రికార్డింగ్ స్టూడియోలో పాటల రికార్డింగ్ కూడా ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ "నా గత సినిమాల మాదిరిగానే మల్టీఫుల్ జోనర్స్‌తో ఈ సినిమా ఉంటుంది. అలాగే భావోద్వేగమైన సన్నివేశాలు, చూపు తిప్పుకోలేని విజువల్స్‌తో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాము. అదేవిధంగా.. నాగార్జున, నాని కెమిస్ట్రీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగిన నేను.. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నాం. ఈ చిత్రంలో నటించే కథానాయికల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామ" ని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com