తండ్రి టైటిల్‌తో నాగ్ మల్టీస్టారర్ మూవీ?
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ్ డాన్‌గా, నాని ఒక డాక్టర్‌గా నటిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే.. ఈ సినిమాకి ‘దేవదాసు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ టైటిల్‌ను గనక ఫైనల్ చేస్తే.. ఇంతవరకు తన తండ్రి సినిమాల్లో పాటలలోని పంక్తులను.. వేరే హీరోల సినిమా పేర్లను తన మూవీ టైటిల్స్‌గా వాడుకున్న నాగ్.. ఇప్పుడు తొలిసారి తన తండ్రి నటించిన సినిమా టైటిల్‌ను తన సినిమాకోసం వాడుకున్నట్టు అవుతుంది. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా.. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com