'మాస్ ,కి 13 ఏళ్లు
Saturday, December 23, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాలలో `మాస్` ఒకటి. నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. ఈ చిత్రం కోసం.. నాగ్‌ని డిఫరెంట్ లుక్‌లో చూపించడంలోనూ, స్టైలీష్‌గా చూపించడంలోనూ దర్శకుడు లారెన్స్ సక్సెస్ అయ్యారు. జ్యోతిక, ఛార్మి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఎస్సెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ నాగ్ అభిమానులను బాగా అలరించింది.
ఆ పాటతో పాటు వాలు కళ్ళ వయ్యారి, నాతో వస్తావా, లల్లలాహిరే పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. 74 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ సినిమా.. కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. సంతోషం, మన్మథుడు, శివమణి, నేనున్నాను.. ఇలా వరుస విజయాలతో ఉన్న నాగ్ ఖాతాలో ఐదో విజయంగా చేరింది. డిసెంబర్ 23, 2004న విడుదలైన మాస్.. నేటితో 13 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments