'మాస్ ,కి 13 ఏళ్లు

  • IndiaGlitz, [Saturday,December 23 2017]

నాగార్జున కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో 'మాస్' ఒక‌టి. నృత్య ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్ర‌మిది. ఈ చిత్రం కోసం.. నాగ్‌ని డిఫ‌రెంట్ లుక్‌లో చూపించ‌డంలోనూ, స్టైలీష్‌గా చూపించ‌డంలోనూ ద‌ర్శ‌కుడు లారెన్స్ స‌క్సెస్ అయ్యారు. జ్యోతిక, ఛార్మి క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు ఎస్సెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ నాగ్ అభిమానుల‌ను బాగా అల‌రించింది.
ఆ పాట‌తో పాటు వాలు క‌ళ్ళ వ‌య్యారి, నాతో వ‌స్తావా, ల‌ల్ల‌లాహిరే పాట‌లు కూడా ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. 74 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ సినిమా.. క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించింది. సంతోషం, మ‌న్మ‌థుడు, శివ‌మ‌ణి, నేనున్నాను.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో ఉన్న నాగ్ ఖాతాలో ఐదో విజ‌యంగా చేరింది. డిసెంబ‌ర్ 23, 2004న విడుద‌లైన మాస్‌.. నేటితో 13 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

'రంగస్థలం' టీజర్ ఎప్పుడంటే..

చిట్టిబాబుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేయబోతున్న చిత్రం రంగస్థలం.

ట‌చ్ చేసి చూడు.. డేట్ మారిందా?

రాజా ది గ్రేట్‌తో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చారు మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న ట‌చ్ చేసి చూడుతో బిజీగా ఉన్నారు. నూతన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ‌.. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు.

అల్లరి నరేష్.. రెండు కొత్త చిత్రాలు

ఇటీవలే మేడ మీద అబ్బాయ్ గా పలకరించాడు హాస్య చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్.

బాహుబలి రీమేక్ వస్తోంది

బాహుబలి,బాహుబలి 2 చిత్రాలు ఎంతటి సంచలన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చరణ్ , కొరటాల చిత్రానికి ముహుర్తం కుదిరిందా?

మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ