'నవాబ్' ట్రైలర్‌ను విడుదల చేసిన కింగ్ నాగార్జున.. ట్రైలర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
గీతాంజలి, బాంబే, రోజా, సఖి వంటి ప్రేమకథలైనా... ఘర్షణ, దళపతి, యువ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఎమోషనల్ చిత్రాలను రంజింప చేసేలా తెరకెక్కించడంలో మేటి దర్శకుడు మణిరత్నం. ఈయన దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందంటే.. సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అలాంటి ట్రెండ్ క్రియేటర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న భారీ తారాగణంతో కూడిన భారీ బడ్జెట్ చిత్రం `నవాబ్`.
లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అరవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, త్యాగరాజన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలను తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ - ``నవాబ్ ట్రైలర్‌ను విడుదల చేసి మమ్మల్ని అభినందించిన కింగ్ నాగార్జునగారికి థాంక్స్. మణిరత్నంగారు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రానున్న చిత్రమే నవాబ్. ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుంది. సినిమా కాన్సెప్ట్ ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మంచి యాక్షన్ ప్యాక్డ్గా ఉంటూనే.. ఎమోషనల్ కంటెంట్‌తో సాగే చిత్రమిది. రవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్ వంటి భారీ తారాగణంతో , ఎ.ఆర్.రెహమాన్, సంతోశ్ శివన్, శ్రీకర్ ప్రసాద్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి టాప్ టెక్నీషియన్స్ సహకారంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మించేలా సినిమా ఉటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం`` అన్నారు.
రవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, త్యాగరాజన్ తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: సంతోశ్ శివన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: కిరణ్, ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్ట రాయ్, కాస్ట్యూమ్స్: లక్హానీ, యాక్షన్: దిలీప్ సుబ్బరాయన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ ఆనంది, రచన: మణిరత్నం, శివ ఆనంది, నిర్మాతలు: మణిరత్నం, సుభాష్ కరణ్, దర్శకత్వం: మణిరత్నం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments