సంక్రాంతి బరిలో నాగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నాగ్ సరసన రమ్యక్రిష్ణ, అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత రాధా మోహన్ కథ, స్ర్కీన్ ప్లే అందించడం విశేషం.
నాగ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన సొగ్గాడే చిన్ని నాయనా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే...ఈ చిత్రాన్ని నాగ్ కి సెంటిమెంట్ నెల అయిన డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేసి...అధికారికంగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారట. మరి..సంక్రాంతి బరిలోకి దిగుతున్న నాగ్ ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com