నాగార్జునకు అస్వస్థత.. అసలేమైంది.. నిజమేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా, వెబ్సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు, సన్నిహితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే నాగ్ ఎలా అస్వస్థతకు ఎలా గురయ్యారు..? అసలేం జరిగిందన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
అసలు విషయానికొస్తే...!
ఆగస్ట్ 29తో కింగ్ 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆరు పదుల వయస్సులోను నవ యువకుడిలా ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్న నాగ్.. బర్త్ డే వస్తే అక్కినేని అభిమానులకు అది ఇక పండుగ రోజే. ఈ సందర్భంగా ఆయన బర్త్‌డే ఏర్పాట్ల గురించి చర్చించేందుకు అభిమాన సంఘాల నాయకులు నాగ్ ఇంటికి వెళ్లగా ఆరోగ్యం సరిగ్గా లేదని.. ఇప్పట్లో ఆయన ఎవరితో ఏమీ మాట్లాడలేరని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సమాచారం. అయితే నాగ్ సార్‌తో ఒకే ఒక్కసారి మాట్లాడుతామని చెప్పినప్పటికీ సెక్యూరిటీ అనుమతించలేదని తెలుస్తోంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియా ద్వారా నాగ్ వీరాభిమానులు చెప్పడంతో ఈ విషయం టాలీవుడ్లో కోడై కూస్తోంది.
ఇదిలా ఉంటే.. మరికొందరు మాత్రం శనివారం నాడు బిగ్‌బాస్ హౌస్‌లో అంత యాక్టివ్‌గా ఉన్న నాగ్ అస్వస్థతకు గురయ్యారంటే నమ్మేలా లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఒక వేళ వరుస షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా గడపడంతో నాగార్జున ఏమైనా అలసటకు గురి కావచ్చనే కోణంలోనూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే.. మన్మథుడు- 2 ప్రమోషన్స్‌లో కార్యక్రమంలో నాగ్ చేతికి చిన్నకట్టు ఉండటంతో ఏం జరిగిందని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. జిమ్‌లో కసరత్తులు ఎక్కువగా చేయడం వల్ల కొంత నొప్పి రావడంతో అలా బ్యాండేజ్ కట్టానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ అస్వస్థతకు సంబంధించి నాగ్ కుటుంబ సభ్యులు కానీ.. ఆయన మేనేజర్, పీఆర్వోగానీ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments