కొత్త ద‌ర్శ‌కుడితో నాగ్‌.. అస‌లు ట్విస్ట్ అదే!

  • IndiaGlitz, [Wednesday,November 06 2019]

రియాలిటీ షో బిగ్‌బాస్ 3ను కింగ్ నాగార్జున విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయ‌న త‌న ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడ‌ట‌. ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు నాగార్జున ఊపిరి చిత్రానికి ర‌చ‌నా శాఖ‌లో ప‌నిచేసిన రైట‌ర్ సాల్మ‌న్ చెప్పిన క‌థ‌కు ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనే నాగ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌.సాధార‌ణంగా నాగార్జున కొత్త‌వారిని ఎంక‌రేజ్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటాడు. ఆ కోవ‌లోనే ఓ రైట‌ర్‌ని డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.

ఇక్కడ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమాలో నాగార్జున హీరో కాద‌ట‌. ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తాడ‌ట‌. క‌థంతా ఆయ‌న చుట్టూనే తిరుగుతుంద‌నేది స‌మాచారం. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి ప్ర‌క‌ట‌న రావ‌చ్చు. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు నాగ్ హోల్డ్‌లో పెట్టిన క‌ల్యాణ్ కృష్ణ సంగ‌తేంటో చూడాలి.

నాగార్జునకు ఆయ‌న గ‌త చిత్రాలు షాక్‌నిచ్చాయి. ఆయ‌న హీరోగా చేసిన ఆఫీస‌ర్‌, నానితో చేసిన మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్‌, రీసెంట్‌గా విడుద‌లైన మన్మ‌థుడు 2 బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశాయి. దీంతో త‌దుప‌రి సినిమా విష‌యంలో నాగ్ కాస్త స‌మ‌యం తీసుకున్నాడు. ఆలోపు రియాలిటీ షో బిగ్‌బాస్‌ను పూర్తి చేశాడు.

More News

నిర్మాత‌గా మారుతున్న మెగా డైరెక్ట‌ర్‌?

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో `సైరా న‌ర‌సింహారెడ్డి` సినిమాను డైరెక్ట్ చేసిన సురేంద‌ర్ రెడ్డి మెగా డైరెక్ట‌ర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

శ్రీశైలంలో ప్రతిధ్వనిస్తున్న పురాణపండ శ్రీనివాస్ 'హరోంహర'

అంతర్గత శక్తులతో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అద్భుత రచనలు చేయడంలో తన సృజనాత్మకతను ఒక పద్ధతి ప్రకారం పనిచేయించడంలో

భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ పూర్తి చేసిన క‌మ‌ల్ హాస‌న్‌

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.

రాశీఖ‌న్నాకు ఇదే తొలిసారి... ఎగ్జ‌యిట్ అవుతుంద‌ట‌

టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా అందచందాల‌తో వెండితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. మంచి గాత్రంతోనూ పాటలు పాడి అంద‌రినీ అల‌రిస్తుంటుంది.

కొత్త లుక్ తో సర్ప్రైజ్ చేసిన శత్రు

'శత్రు' తెలుగులో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులలో ఒకరు. "కృష్ణ గాడి వీర ప్రేమ కథ " తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శత్రు