జీవితాన్ని మార్చే సినిమా ఊపిరి - అక్కినేని నాగార్జున
- IndiaGlitz, [Thursday,March 17 2016]
కొత్తదనం కోసం తపిస్తూ...వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో..కొత్త సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే అగ్రహీరో అక్కినేని నాగార్జున. మనం, సోగ్గాడే చిన్ని నాయనా... చిత్రాలతో వరుస విజయాలు సాధించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ఊపిరి. నాగార్జున - కార్తీ- తమన్నా కాంబినేషన్లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్నినిర్మించింది. ప్రపంచ వ్యాప్తంగా ఊపిరి చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున తో ఇంటర్ వ్యూ మీకోసం...
ఊపిరి సినిమా కోసం వీల్ ఛైర్ లో కూర్చొని నటించడం నటిస్తున్నప్పుడు ఏమనిపించింది...?
కాళ్లు, చేతులు కదపకుండా ఫేస్ లో చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో నటించడం అంటే చాలా కష్టం. ఒక్కొక్కసారి ఇరవై టేకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏమిటి సరిగ్గా చేయలేకపోతున్నాం. నాకు ఏక్టింగ్ రాదా అనిపించింది. కాకపోతే వంశీ కి ముందే చెప్పాను. సీన్ ఎలా వస్తుందో నాకు తెలియదు. కాబట్టి సరిగ్గా రాకపోతే వచ్చే వరకు చెప్పు చేస్తాను అని . అలాగే సీన్ బాగా వచ్చే వరకు ఎన్ని టేకులు తీసుకున్నా ఫరవాలేదనుకుని చేసాను. సినిమా అంతా అయిన తర్వాత చూసాను చాలా బాగా వచ్చింది. సో...హ్యాఫీ.
ఊపిరి తమిళ్ వెర్షెన్ కి డబ్బింగ్ మీరే చెప్పారు కదా..ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..?
ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. అసలు తమిళ్ వెర్షెన్ లో నా క్యారెక్టర్ కి వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించేసారు. అది కార్తీ చూసి కరెక్ట్ గా లేదు. మీరు చెబితేనే బాగుంటుంది అని చెప్పి పట్టుబట్టి నాతో తమిళ్ డబ్బింగ్ చెప్పించాడు. ఇప్పుడు తమిళ్ డబ్బింగ్ పూర్తి చేసాను. కాస్త కష్టం అనిపించింది. తమిళ్ రాక కాదు స్లాంగ్ వల్ల అలా అనిపించింది అంతే.
ఊపిరి ఓరిజినల్ ఇన్ టచ్ బుల్స్ చూసారా..
ఇప్పుడు కాదు..నాలుగైదు సంవత్సరాల క్రితమే ఈ సినిమాని చూసాను. చాలా కామెడీ ఉంటుంది. నవ్వుతూనే చూసాను. ఎక్కడా ట్రాజిడి లేదు. నాకు బాగా నచ్చింది. తెలుగులో కూడా ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది.
ఊపిరి ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
డైరెక్టర్ వంశీ, పి.వి.పి వచ్చి డి.వి.డి ఇచ్చారు. వంశీ నేను ఏమంటానో అని కాస్త నెర్వస్ గా ఉన్నాడు. మీరు చేస్తేనే ఈ సినిమా చేస్తాం లేకపోతే సినిమా చేయం అన్నారు. అసలు స్టోరి ఏమిటి అని అడిగితే..ఫ్రెంచ్ ఫిల్మ్ ఇన్ టచ్ బుల్స్ అని చెప్పారు. ఈ సినిమా నేను చూసాను. నాకు నచ్చింది అని చెప్పి వెంటనే ఓకే చెప్పేసాను.
నాన్నగారు వీల్ ఛైర్ లో కూర్చొవడం ఏమిటి వద్దు అని చెప్పాను అని అఖిల్ అన్నారు. మీరు ఎలా కన్విన్స్ చేసారు..?
ఈ కథ తెలుసుకుని అఖిల్ ఈ సినిమా చేయద్దు అన్నాడు. డిఫరెంట్ రోల్ చేస్తే బాగుంటుంది. ఇది ఒక మంచి సినిమా అని చెప్పాను. అఖిల్ ఇప్పటికీ కన్విన్స్ అవ్వలేదు.
మీరు సినిమా అంతా వీల్ ఛైర్ లో కూర్చొవడం అంటే ఫ్యాన్స్ ఏక్సప్ట్ చేస్తారా..?
నేను వంద సినిమాలు గ్యారెంటీగా చేస్తాను. అందులో ఒక సినిమాలో వీల్ ఛైర్ లో కూర్చున్నా ఏక్స్ ప్ట్ చేస్తారు. అంతే కాకుండా మా హీరో ఇలా డిఫరెంట్.. డిఫరెంట్ రోల్స్ చేస్తాడు అని ప్రౌడ్ గా ఫీలవుతారు.
సోగ్గాడు చిన్ని నాయనా సినిమాలో రొమాంటిక్ గా నటించి ఊపిరిలో ఇలా వీల్ ఛైర్ లో కూర్చునే పాత్ర చేయడం గురించి..?
నిన్నే పెళ్లాడతా తర్వాత అన్నమయ్య సినిమా చేస్తున్నప్పుడు కూడా ఇలాగే అడిగారు. దేవి థియేటర్ లో నిన్నే పెళ్లాడతా సినిమా కళకళలాడుతుంటుంటే నేనేమో కాషాయం వస్త్రాలు వేసుకుని అన్నమయ్య షూటింగ్ కి వెళ్లేవాడిని అప్పుడూ ఇలాగా అడిగారు. సినిమా బాగుంటే.. కన్విన్సింగ్ గా ఉంటే తప్పకుండా చూస్తారు.
కార్తీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
స్లమ్ లో ఉండే పర్సన్ గా నా కేర్ టేకర్ గా నటించాడు. మా ఇద్దరికి తమన్న వారథిలా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్ షిప్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. కార్తీ నటిస్తుంటే అలా చూస్తున్నాం. జయసుధ గారు కూడా అదే అన్నారు. కార్తీ నటిస్తుంటే అసలు నటించినట్టు ఉండదు అని.
మిమ్మల్ని పక్కన పెట్టుకుని కార్తీ - తమన్నా ఇద్దరు డ్యూయెట్స్ పాడుకుంటుంటే ఏమనిపించింది..?
ఇప్పుడు కాదు కానీ...తమన్నా 100% లవ్ సినిమాలో చైతన్య తో డ్యూయెట్స్ పాడుడూ రొమాన్స్ చేస్తుంటే అనిపించింది. ఏమని అంటే...తమన్నా నాతో కాకుండా చైతన్యతో రొమాన్స్ చేస్తుంది ఏమిటని...(నవ్వుతూ..)
మీరు తమన్నాతో డాన్స్ చేయలేకపోయానని ఫీల్ అయ్యానని ఊపిరి ఆడియో ఫంక్షన్ లో చెప్పారు కదా..ఇదే విషయం తమన్నాతో అంటే ఊపిరి 2 లో నాగ్ సార్ తో డాన్స్ చేస్తాను అంది..? ఊపిరి - 2 ఉంటుందా..?
ఊపిరి - 2 లో తమన్నా నాతో డాన్స్ చేస్తే...వీల్ ఛైర్ లో కార్తీని కూర్చొబెడుతుందా...(నవ్వుతూ..)
ఊపిరి లో మీరు గెడ్డంతో కనిపిస్తారని తెలిసింది..? ప్లాష్ బ్యాక్ లో అలా కనిపిస్తారా..?
ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ అంటూ ఏమీ లేదు. కాకాపోతే..గెడ్డం తో కనిపించడం అంటారా..అది ఇప్పుడు చెప్పడం ఎందుకు..? తెర పై చూడండి తెలుస్తుంది. (నవ్వుతూ..)
డైరెక్టర్ వంశీ వర్కింగ్ స్టైల్ గురించి..?
వంశీ ఈ సినిమాని చాలా బాగా తీసాడు. అలాగే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత వంశీకి చాలా మంచి పేరు వస్తుంది.
గోపీ సుందర్ మ్యూజిక్ గురించి..?
గోపీ సుందర్ రెండు నేషనల్ అవార్డ్స్ అందుకున్నాడు. ఊపిరి ఎమోషనల్ జర్నీ. దీనికి తగ్గట్టు పాటలకే కాకుండా సిట్యూవేషన్ కి సరిపడేలా అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. సీన్స్ కి తగ్గట్టు మ్యూజిక్ కుదరడంతో అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అందర్ని కదిలిస్తుంది.
రాఘవేంద్రరావు గారితో చేస్తున్న సినిమా ఎప్పుడు ప్రారంభం..?
ప్రస్తుతం లోకేషన్స్ చూస్తున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.
అఖిల్ రెండో సినిమా వంశీ పైడపల్లి దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి..?
అఖిల్ - వంశీ వీళ్లిద్దరు డిష్కష్ చేసుకుంటున్నారు. వీళ్లు ఫైనల్ చేసుకుని ఫైనల్ గా నా దగ్గరికి వస్తారు. రీమేక్ చేయాలా..స్ట్రైయిట్ సినిమానా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఊపిరి రిలీజ్ తర్వాత అఖిల్ సినిమా గురించి నిర్ణయం తీసుకుంటాను.
ఊపిరి సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు..?
ఊపిరి మంచి సినిమా. లాండ్ మార్క్ సినిమా...అది ఇదీ అని చెప్పను కానీ...నా వరకు అయితే లైఫ్ ఛేంజ్ చేసే సినిమా అని చెబుతాను.