చాలా గర్వంగా ఫీలవుతున్నాను - నాగార్జున అక్కినేని
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్తదనాన్ని.. కొత్త డైరెక్టర్స్‌ని ప్రోత్సహించడంలో కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుంటారు అనేది 'చి.ల.సౌ' చిత్రంతో మరోసారి ప్రూవ్ అయ్యింది. యంగ్ హీరో సుశాంత్ హీరోగా, రుహాని శర్మ హీరోయిన్‌గా సిరుని సినీ కార్పోరేషన్ పతాకంపై నాగార్జున అక్కినేని, జస్వంత్ నడిపల్లి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'చి.ల.సౌ'.
ఈ చిత్రాన్ని చూసిన కింగ్ నాగార్జున ఎంతో నచ్చి ఇంప్రెస్ అయ్యి అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ మనం ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆగస్ట్ 1న అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.
జెన్యూన్‌గా సినిమా చాలా బాగుంది!!
కింగ్ నాగార్జున మాట్లాడుతూ - ''అన్నపూర్ణ సంస్థ ఎప్పుడూ న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే 'చి.ల.సౌ' చిత్రానికి కూడా అలాగే జరిగింది. చాలామంది సుశాంత్ మా ఫ్యామిలీ మెంబర్ అందుకే చేస్తున్నారు అనుకుంటున్నారు. అస్సలు కానే కాదు. ఈ సినిమా నాగచైతన్య చూసి ''చి.ల.సౌ' సినిమా చాలా బాగుంది. ఒకసారి చూడండి'' అన్నాడు. అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాను. 'నిజంగా సినిమా చాలా జెన్యూన్‌గా బాగుంది. ఓపెన్ మైండ్‌తో చూడండి' అన్నాడు. ఈ సినిమా గురించి ఇందులో ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్, నిర్మాతలు గురించి నాకు ఏమీ తెలీదు. చైతు చెప్పాడని నెగిటివ్‌గానే సినిమా చూడ్డానికి వెళ్ళాను. పిల్లలు అడిగితే కాదనలేం కదా! వెళ్ళి చూశాను. సినిమా చాలా ప్లెజెంట్‌గా వుంది. సినిమా చూస్తుంటే రాను రాను బ్యూటిఫుల్‌గా వుంది. చాలా సర్‌ప్రైజ్ అయ్యాను.
నెగిటివ్ మైండ్‌తో వున్న నేను 10 నిమిషాల తర్వాత అదిపోయి ఓపెన్ మైండ్‌తో కామన్ ఆడియన్‌లా చూశాను. చాలా అరెస్టింగ్‌గా వుంది. నాకు బాగా నచ్చింది. రైటింగ్, స్క్రీన్‌ప్లే ఫెంటాస్టిక్‌గా వుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంతో బాగా చేశారు. రీ-రికార్డింగ్ ఎక్కడ ఎంత కావాలో అంతే చేశారు. రాహుల్ సూపర్బ్‌గా తీశాడు. ఇలాంటి సినిమాలు నేను ఎందుకు తియ్యట్లేదు అన్పించింది. ఈ సినిమాని అన్నపూర్ణ నుండి బ్యాక్ చేద్దాం అనగానే రాహుల్ ఇమ్మీడియెట్‌గా ఓకే అన్నాడు. అలా ఈ సినిమాతో నిర్మాత ఎంటర్ అయ్యాను. నాకు ఇదొక కొత్త జర్నీ. 'ఉయ్యాలా జంపాలా' సినిమా బిగినింగ్ నుండి రామ్మోహన్‌తో టైఅప్ అయి వున్నాం.
ఆ సినిమా స్క్రిప్ట్ అన్నీ మాకు తెల్సు. బట్ ఈ సినిమాకి ఏం తెలీదు. నిర్మాతలు భరత్, జస్వంత్, హరి ముగ్గురు ప్రొడ్యూసర్స్ చాలా రిస్క్ తీసుకుని సినిమాని అద్భుతంగా నిర్మించారు. ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను పార్టనర్‌గా జాయిన్ చేసుకున్నందుకు నిర్మాతలకు నా థాంక్స్. ఆకలితో వున్నవారికి అన్నం చాలా రుచిగా వున్నట్లు ఈ సినిమాని అలాగే చేశారు. కొత్తదనం వున్న సినిమాలు ప్రజెంట్ బాగా ఆడుతున్నాయి. ప్రేక్షకులు ఏది పడితే అది చూడట్లేదు.
రాహుల్ బ్రిలియంట్‌గా తీశాడు!!
ఈ 'చి.ల.సౌ' చిత్రాన్ని కూడా రాహుల్ చాలా కొత్తగా తెరకెక్కించాడు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక అందరూ అదే ఫీలవుతారు. ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా బ్రిలియంట్‌గా తీశాడు. ఆర్టిస్ట్‌లతో చక్కగా పెర్‌ఫార్మెన్స్ చేయించుకున్నాడు. ఇలాంటి సినిమాని మా అన్నపూర్ణ ద్వారా చేయడం ప్రౌడ్‌గా ఫీలవుతున్నాం. సుశాంత్, రుహాని ఔట్ స్టాండింగ్ పెర్‌ఫార్మెన్స్ చేశారు.
వెన్నెల కిషోర్ కామెడీ, త్రూ ఔట్ నవ్విస్తూనే వుంటుంది. ఈ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేదు. రాహుల్ నెక్స్‌ట్ ఫిల్మ్ మా అన్నపూర్ణలో వుంటుంది. మంచి స్క్రిప్ట్ చేసే పనిలో వున్నాడు. ఇలాగే సినిమాలు రిలీజ్ అవక మరుగున పడిపోతున్నాయి. మంచి సినిమాలు కొత్తదనం వున్న చిత్రాలను బాగుంటే వాటిని పుష్ చేస్తాం. ఇదొక కొత్త జర్నీ నాకు. చాలా శాటిస్‌ఫై అయ్యాను.
రైటింగ్, స్క్రీన్‌ప్లే బాగుండాలి!
రీసెంట్‌గా 'రంగస్థలం', 'మహానటి' చిత్రాలు ఆర్టిస్ట్‌ల పెర్‌ఫార్మెన్స్ పక్కన పెడితే స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా వుంది. అందుకే అద్భుత విజయాలు సాధించాయి. అలాగే హిందీలో అలియా భట్ చేసిన 'రాజీ' మూవీ చూశాను. ఫెంటాస్టిక్‌గా వుంది. ఈమధ్య తెలుగులో రిలీజ్ అయిన 'ఆర్.ఎక్స్-100' మూవీ క్లైమాక్స్ కొంత చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. దర్శకుడు అనుకున్న పాయింట్‌ని చాలా కొత్తగా, హానెస్ట్‌గా తీశాడు. అది మంచి సక్సెస్ అయ్యింది. ఆర్టిస్ట్‌ల పెర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది.
15 ఏళ్ల తర్వాత స్క్రిప్ట్ నచ్చి చేస్తున్నాను!!
'శివ' టైమ్‌లో రామ్‌గోపాల్ వర్మ బాలీవుడ్‌కి రమ్మని అడిగాడు. నేను తెలుగు సినిమాలే ముఖ్యమని చెప్పాను. మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు చేశాను. మళ్ళీ 15 ఏళ్ల గ్యాప్ తర్వాత 'బ్రహ్మాస్త్ర' సినిమా వచ్చింది. కరణ్ జోహార్ అద్భుతమైన డైరెక్టర్. చాలా గొప్ప సినిమాలు తీశారు. ఆయన స్క్రిప్ట్ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. కానీ నా క్యారెక్టర్ 15 నిమిషాలు వుంటుంది. అది త్రీడీ ఫార్మెట్‌లో చేసి చూపించమన్నాను.
త్రీ మంత్స్ తర్వాత వచ్చి త్రీడి వెర్షన్ చూపించారు. ఔట్ స్టాండింగ్‌గా అన్పించింది. ఇమ్మీడియెట్‌గా ఒప్పుకున్నాను. ఆల్‌రెడీ వన్ వీక్ షూటింగ్ అయ్యింది. చాలా ఎగ్జైటింగ్‌గా వుంది. రణ్‌బీర్, అలియా భట్‌లాంటి టాలెంటెడ్ యాక్టర్స్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా వుంది. అలాగే 'ఊపిరి' తెలుగు, తమిళ్ చేశాను. తమిళంలో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. ఆ వివరాలు వన్ వీక్‌లో తెలుస్తాయి.
కంప్లీట్ ఫన్ ఫిల్మ్ 'దేవదాస్!!
'దేవదాస్' ఆల్‌మోస్ట్ షూటింగ్ ఫినిష్ అయ్యింది. ఒక టెన్ డేస్ షూట్ బేలెన్స్ వుంది. నా క్యారెక్టర్ దేవ్. నాని క్యారెక్టర్ దాస్. కంప్లీట్ ఫన్ ఫిల్మ్ ఇది. లాటాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. రాజు హిరాణి ఫిలింస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా వుంటుందో 'దేవదాస్'లో అలా వుంటుంది. నానితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా వుంది. వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ సీక్వెల్ కూడా చేస్తాం.
మీ నెక్స్‌ట్ ఫిల్మ్?
'బంగార్రాజు' స్క్రిప్ట్ జరుగుతోంది. రైటర్ సత్యానంద్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథపై వర్క్ చేస్తున్నారు. అన్నపూర్ణ బేనర్‌లోనే ఈ సినిమా వుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments