బోయపాటి మూవీలో నాగ్ హీరోయిన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ చిత్రాన్ని సాహసం శ్వాసగా సాగిపో చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాని ఇటీవల ప్రారంభించారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.
ఇప్పుడు మరో హీరోయిన్ కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ నాగార్జున - రాఘవేంద్రరావుల ఓం నమో వేంకటేశాయ, కృష్ణవంశీ నక్షత్రం ఈ రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ ఇద్దరి క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com