నాగ్ సరసన నటించేది ఎవరు..

  • IndiaGlitz, [Tuesday,July 05 2016]

కింగ్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న మ‌రో భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. వెంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడు హ‌థీరామ్ బాబా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో వేసిన ఆల‌యం సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.
ఈ చిత్రంలో విమ‌లారామ‌న్ , కంచె ఫేం ప్ర‌గ్యాజైస్వాల్ ముఖ్య‌పాత్రలు పోషిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న అందాల తార అనుష్క న‌టిస్తుంది. ఇటీవ‌ల నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయానా, ఊపిరి చిత్రాల్లో అనుష్క న‌టించింది. ఈ రెండు చిత్రాలు ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయో తెలిసిందే. సో..సెంటిమెంట్ ప్ర‌కారం ఓం న‌మో వెంక‌టేశాయ కూడా సంచ‌ల‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.