చైతు, సమంత ప్రేమకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇదిగో సాక్ష్యం..!
- IndiaGlitz, [Monday,August 29 2016]
నాగ చైతన్య, సమంత ప్రేమించికుంటున్నట్టు...త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వార్తల పై నాగార్జున స్పందిస్తూ...చైతన్య, అఖిల్ పెళ్లి విషయంలో నిర్ణయం వారిదే. ఇద్దరి పెళ్లిల్లు ఒకేసారి జరుగుతాయి అంటూ ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం లేదు. ఇద్దరి పెళ్లిల్లు వేరు వేరుగా చేయాలనుకుంటున్నాను అని తెలియచేసారు. కానీ...చైతన్య ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడో చెప్పలేదు. ఇదిలా ఉంటే...నాగార్జునకు అత్యంత సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె పెళ్లికి సమంత.... నాగ చైతన్య, అఖిల్, నాగార్జున, అమలతో కలిసి వేడుకకు రావడం విశేషం. దీంతో నాగచైతన్య, సమంతల పెళ్లికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని చెప్పకనే చెప్పేసారు అంటూ ప్రచారం జరుగుతుంది. మరి...చైతు, సమంత వారి పెళ్లి విషయాన్ని అఫిషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి..!