Bigg Boss Telugu 7 : అమర్‌కు ఊహించని సర్‌ప్రైజ్.. కానీ కండీషన్ , మరోసారి గౌతమ్ - శివాజీల గొడవ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు 7 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ వారం నిర్వహించిన టికెట్ టు ఫినాలే టాస్క్‌ల్లో విజయం సాధించి అర్జున్ అంబటి ఈ సీజన్‌లో తొలి ఫైనలిస్టుగా నిలిచాడు. ఎవ్వరూ సాయం చేయకపోయినా తన కష్టంతో టాస్క్‌ల్లో గెలిచి ఫైనల్‌లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మిడిల్‌లో ఎంట్రీ ఇచ్చినా తనదైన గేమ్, స్ట్రాటజీతో ఇక్కడి వరకు వచ్చాడు. ఇక శనివారం కావడంతో ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి.. ఈ వారం కంటెస్టెంట్స్ తప్పొప్పులు, గేమ్ రివ్యూ చేశారు. రాగానే శివాజీ, ప్రియాంక, అమర్‌దీప్, గౌతమ్‌లకు క్లాస్ పీకాడు.
ప్రతిసారి.. ప్రతి ఆటలోనూ శివాజీతో నువ్వు గొడవ ఎందుకు పడతావ్ అని గౌతమ్‌ను అడిగారు నాగ్. ఆయన ఇద్దరికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని నీకు కోపం కదా మరి అలాంటప్పుడు ప్రియాంకను ఎందుకు అడగటం లేదు అని ప్రశ్నించారు. దీనికి అవును అని ఆన్సర్ ఇచ్చాడు గౌతమ్. ఇప్పటి నుంచి హౌస్‌లో గ్రూపులు వద్దని.. అందరూ ఒక్కొక్కరుగానే ఆడాలని తేల్చి చెప్పారు నాగార్జున. అయితే ఫినాలే అస్త్ర టాస్క్‌ల సమయంలో ప్రియాంక తీవ్రంగా కష్టపడింది. అమర్‌దీప్ ఆమెను ఫిజికల్‌గా అటాక్ చేసినా ఆమె ధీటుగా పోరాడింది. తర్వాత పాయింట్స్ ఇవ్వలేదంటూ అమర్ ఎంతగా హింసించినా తట్టుకుంది. ఇంత చేసినా అతని కోసం గౌతమ్ చేత పాయింట్స్ ఇప్పించింది. కానీ ఆమెలో ఎంతో వేదన వుంది. అందుకే ఇతర కంటెస్టెంట్స్‌తో చెప్పుకోలేని విషయాలను నాగార్జునతో చెప్పింది.
అమర్ నిన్న బ్లాక్ మెయిల్ చేశాడా, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడా అని సూటిగా అడిగారు నాగార్జున .. దీనికి ఆమె అవును చేశాడు అని అంగీకిరంచింది. ఇక అమర్‌దీప్‌ను అయితే చెడుగుడు ఆడుకున్నారు నాగ్. ఎవరిని ఎక్కడ బ్లాక్‌మెయిల్ చేసి పాయింట్స్ తీసుకోవాలో తెచ్చుకున్నావ్, ఫౌల్ గేమ్ ఆడి ముందుకొచ్చేశావ్ అంటూ కామెంట్స్ చేశారు. అయితే దీనిని తాను కావాలని చేయలేదని తన తప్పును సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు అమర్. అతను చేసిన తప్పులకు పనిష్మెంట్ గట్టిగా వుంటుందని అంతా అనుకుంటున్న వేళ నాగార్జున షాకిచ్చారు. 1200 పాయింట్స్ సాధించినందుకు గాను ఈ వారం నువ్వే కెప్టెన్ అని ప్రకటించడంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు. నీకు వీఐపీ రూమ్ కూడా వుంటుందని అని చెబుతూ.. ఎక్స్‌పెక్ట్ చేయని కండీషన్ పెట్టాడు. నీకు ప్రియాంక, శోభాలు డిప్యూటీలు కాదని, గతంలో కెప్టెన్‌కు వచ్చే ఇమ్యూనిటీ పవర్ నీకు దక్కదని చెప్పారు. అనంతరం అర్జున్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను అమర్‌దీప్‌కు అందజేశాడు. శివాజీ, అర్జున్‌లను అతనికి డిప్యూటీలుగా నియమించారు నాగ్.
ఇక గ్రాండ్ ఫినాలేలో స్థానం సంపాదించిన తొలి కంటెస్టెంట్ అర్జున్‌ని ప్రశంసించారు నాగార్జున. తర్వాత ‘‘బీబీ లైబ్రరీ’’ అని గేమ్ ఆడించారు. దీనిలో భాగంగా కొన్ని పేర్లు రాసున్న పుస్తకాలను నచ్చిన కంటెస్టెంట్స్‌కి డెడికేట్ చేయాలి. ఈ క్రమంలో గౌతమ్, శివాజీకి మరోసారి పడింది. ‘‘ప్రతిదానికీ నేనే రైట్ అని అనుకోకుండా ఎలా వుండాలి ’’ అనే పుస్తకాన్ని శివాజీకి ఇచ్చాడు గౌతమ్. దీనికి మండిపోయిన శివాజీ రివర్స్‌లో ‘‘కుళ్లు, కుట్ర, కుతంత్రం నుంచి విముక్తి పొందడం ఎలా ’’ అనే పుస్తకాన్ని గౌతమ్‌కు ఇచ్చాడు. అయితే నాగార్జున కూడా ‘‘ నిజాలు చెప్పడం ఎలా ’’ అనే పుస్తకాన్ని అమర్‌కు ఇవ్వడం విశేషం.
ఇకపోతే.. ఈ వారం అర్జున్, శివాజీ, ప్రశాంత్, గౌతమ్, శోభా శెట్టి, ప్రియాంక, యావర్ నామినేషన్‌లో ఉన్నారు. అర్జున్ గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టడంతో ఆయన నామినేషన్ నుంచి సేఫ్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. అయితే ఈ వారం గౌతమ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఎవరు ఇంటిని వీడారు అనేది తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout