close
Choose your channels

అమ‌ల‌కి నాగ్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్..?

Saturday, September 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీమ‌తి అమ‌ల పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున శ్రీమ‌తి అమ‌ల‌కి బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఇంత‌కీ నాగ్ అమ‌ల‌కి ఇచ్చిన గిఫ్ట్ ఏమిట‌నుకుంటున్నారా..? ఒక్క‌సారి ఓ ముద్దు..ఒక్క‌చోట ఓ ముద్దు..ఒక్కొలాగ ఓ ముద్దు...అనే రొమాంటిక్ సాంగ్ ను అమ‌ల‌కి అంకితం ఇచ్చారు. ఇంత‌కీ...ఈ పాట ఏ చిత్రంలోది. నాగార్జున తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయ‌న చిత్రంలోదా..అనుకుంటున్నారా ..? కాదు. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టిస్తున్న నిర్మ‌లా కాన్మెంట్ సినిమాలో పాట .

ఫ్రెష్ ల‌వ్ స్టోరీగా నిర్మ‌లా కాన్వెంట్ రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. రోష‌న్ స‌ర‌స‌న జై చిరంజీవ‌, దూకుడు చిత్రాలో బాల‌న‌టిగా న‌టించిన శ్రేయా శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు కోటి త‌న‌యుడు రోష‌న్ సాలూరి సంగీతం అందిస్తున్నారు. నాగ కోటేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న నిర్మ‌లా కాన్వెంట్ లో నాగార్జున ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తుండ‌డం విశేషమైతే...ఈ సినిమాలో పాట‌ను అమ‌ల‌కి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అంకితం ఇవ్వ‌డం మ‌రో విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.