బాహుబలి 2 కోసం నాగార్జున..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి 2 ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే...మరో వైపు చకచకా బిజినెస్ జరిగిపోతుంది. ఇంతకీ బాహుబలి 2 కోసం నాగార్జున..? ఏమిటి అనుకుంటున్నారా..? బాహుబలి 2 కృష్ణా జిల్లా రైట్స్ ను నాగార్జున, సాయి కొర్రపాటి దక్కించుకున్నట్టు సమాచారం. బాహుబలి 2 కోసం నాగార్జున రంగంలోకి దిగడం ఓ విశేషమైతే... 8 కోట్లు చెల్లించి కృష్ణా జిల్లా రైట్స్ దక్కించుకున్నట్టు మరో విశేషం అంటూ ప్రచారం జరుగుతుంది.
బాహుబలి కృష్ణా జిల్లా రైట్స్ ను 6.8 కోట్లకు అమ్మితే...ఇప్పుడు బాహుబలి 2 రైట్స్ 8 కోట్లకు అమ్మారంటే ఈ మూవీ పై ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతుంది. ఇక మిగిలిన ఏరియాల్లోను, అలాగే ఓవర్ సీస్ లోను కూడా బాహుబలి 2కు భారీ రేటు ఖాయం అనిపిస్తుంది. ఇదే కనుక జరిగితే...బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments