నువ్వేమైనా తోపా, తురుమా... ఆదిరెడ్డికి నాగ్ క్లాస్, శ్రీసత్య వెకిలి నవ్వులపై గరం
Send us your feedback to audioarticles@vaarta.com
ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత చేటు చేస్తుందో గలాటా గీతూని చూసి బిగ్‌బాస్ ఇంటిలోని కంటెస్టెంట్స్ నేర్చుకోవచ్చు. తనకు మాత్రమే అన్ని తెలుసు అన్నట్లు వ్యవహరించడమే కాకుండా... బిగ్‌బాస్ విన్నర్‌ని తానేనని, ప్రతి ఆడపిల్లా గర్వపడేలా చేస్తానని తన స్ట్రాటజీలు ప్లే చేసి చివరికి ఎలిమినేట్ అయ్యింది. ఈ సంఘటన చూసి కూడా కొందరు ఇంటి సభ్యులు అలాగే బిహేవ్ చేస్తున్నారు. వీరిలో ఆదిరెడ్డి ఒకరు. తొలి నుంచి తన పని తాను చేసుకోవడం.. ఇంటి సభ్యుల ఆటపై రివ్యూలు ఇవ్వడం చేస్తూ వుండటంతో మనోడికి మంచి మార్కులే పడుతున్నాయి. కానీ గత కొన్ని రోజులుగా మాత్రం టాస్కుల్లో సరిగా పార్టిసిపేట్ చేయడం లేదు. తానే విన్నర్‌నని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయిపోయాడు ఆదిరెడ్డి. ఇదే సమయంలో టైటిల్ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీని కట్ చేస్తూ వుండటంతో తన డబ్బంతా పోతుందని విలవిలలాడిపోయాడు. ఈ భ్రమలన్నీ తొలగించే ప్రయత్నం చేశారు నాగ్.
శనివారం కావడంతో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే ఆదిరెడ్డికి క్లాస్ తీసుకున్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్టా... ఆ పాస్ ఎవరికి వస్తే, వారికి ఓట్లు రావా..? నువ్వేమన్నా తోపా తురుమా..? ఆడియన్స్ ఏమనుకుంటున్నారు చెప్పడానికి అంటూ విరుచుకుపడ్డారు. ఆ టాస్క్‌లో నువ్వే గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ నీకు వచ్చి వుంటే .. ఒక మంచి కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లకుండా ఆపేవాడివి కదా అని నాగ్ అన్నారు. అలా చేస్తే జనం ఎంత మెచ్చుకుంటారో కదా అని ఆయన పేర్కొన్నారు.
ఈవారం గేమ్ బాగా ఆడావంటూ రేవంత్‌ను మెచ్చుకున్నారు నాగ్. ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన టాస్క్‌లో బరువు మోసేందుకు ప్రయత్నించిన శ్రీహాన్పైనా ప్రశంసలు కురిపించారు. అయితే కెప్టెన్‌గా వున్నప్పుడు శ్రీసత్యకు వంట రాదని చెప్పినప్పుడు ఆమెను వదిలేసి కీర్తికి మాత్రం ఆర్డర్స్ వేయడంపై నాగ్ సుతిమెత్తగా మందలించారు. ఇది తనకు గుర్తు లేదంటూ శ్రీహాన్ బుకాయించే ప్రయత్నం చేయగా.. తాను గుర్తుచేస్తానంటూ వీడియో ప్లే చేసి చూపించాడు. అలాగే కీర్తి చెప్పిన కుక్క సామెతపైనా నాగ్ కామెంట్స్ చేశారు. సామెతను సామెతలాగే చూడాలని దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయొద్దని ఆయన సూచించారు.
అటు నామినేషన్స్ చేసేటప్పుడు నీకు నవ్వేందుకు వస్తుందమ్మా అంటూ సత్యను ప్రశ్నించారు నాగ్. అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుందంటూ శ్రీసత్య పరువు తీసేశాడు. తర్వాత ఆడియన్స్‌తో మీమ్స్ గేమ్ ఆడించి సందడి చేయించాడు. ఈరోజు నామినేషన్స్‌లో వున్న ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను సేవ్ చేశాడు నాగ్. మొత్తం మీద శనివారం ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది.
ఇకపోతే... ఈ వారం ఫైమా, రాజ్ తప్పించి రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, మెరీనా, ఇనయాలు నామినేషన్స్‌లో వున్నారు. వీరిలో మెరీనా, రోహిత్, కీర్తి డేంజర్ జోన్లో వుండగా.. అందరికంటే తక్కువ ఓటింగ్‌తో మెరీనా ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. నిజానికి మెరీనా తొలి నుంచి బిగ్‌బాస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మెతక కావడంతో గొడవలకు దూరంగా వుండేది, ఏ వివాదంలోనూ తలదూర్చేది కాదు. ఎప్పుడు చూసినా తన భర్త రోహిత్ వెంటే వుండేది. అయితే తర్వాతి రోజుల్లో నాగార్జున , బిగ్‌బాస్‌లు క్లాస్ పీకడంతో ఆటతీరు మార్చుకుంది. టాస్కుల్లో గెలిచేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె ఎలిమినేషన్ షాకే. పైగా బిగ్‌బాస్‌లో తన భర్తతో కలిసి పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలని మెరీనా ఎంతగానో భావించింది. దీనిపై బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేసింది కూడా. మరోవైపు ఆమె ఎలిమినేట్ అయితే రోహిత్ కూడా మెంటల్‌గా వీక్ అవుతాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments