కోటి రూపాయిలిచ్చి ‘కింగ్’ అనిపించుకున్న నాగ్..

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే విరాళాలు ప్రకటించారు.

తాజాగా అదే జాబితాలోకి యువసామ్రాట్, టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున చేరారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో(టీఎఫ్‌ఐ)ని రోజువారి కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా రూ. కోటి విరాళం ప్రకటిస్తున్నట్లు నాగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నగదు మొత్తాన్ని టీఎఫ్‌ఐకి కింగ్ అందించారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వారికి ఈ సందర్భంగా కింగ్ ధన్యవాదాలు తెలిపారు. దేవుడు మనలందర్నీ చల్లగా చూస్తాడని.. అందరూ ఇంట్లోనే ఉండాలని సురక్షితంగా ఉండాలని నాగ్ పిలుపునిచ్చారు.

More News

చ‌ర‌ణ్ త‌దుప‌రి ద‌ర్శ‌కుడు అత‌నేనా?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ‘రౌద్రం ర‌ణం రుధిరం’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్

రాజ‌మౌళి చిత్రంలో మ‌రో సూపర్ స్టార్ ?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా

తార‌క్ అన్నీ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెబుతాడు..!

‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు ప్ర‌త్యేక కార‌ణాలు చెప్ప‌న‌క్క‌ర్లేదు. ‘బాహుబ‌లి’ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

ఇండియాలో ఫస్ట్ టైమ్ కోవిడ్-19 మైక్రోస్కోపీ చిత్రం

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో రోజురోజుకూ కరోనా

లాక్‌డౌన్ పొడిగిస్తున్నాం.. ఇళ్లలో నుంచి బయటికి రాకండి : కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఏప్రిల్-15 వరకు ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన..