కోటి రూపాయిలిచ్చి ‘కింగ్’ అనిపించుకున్న నాగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే విరాళాలు ప్రకటించారు.
తాజాగా అదే జాబితాలోకి యువసామ్రాట్, టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున చేరారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో(టీఎఫ్ఐ)ని రోజువారి కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా రూ. కోటి విరాళం ప్రకటిస్తున్నట్లు నాగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నగదు మొత్తాన్ని టీఎఫ్ఐకి కింగ్ అందించారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వారికి ఈ సందర్భంగా కింగ్ ధన్యవాదాలు తెలిపారు. దేవుడు మనలందర్నీ చల్లగా చూస్తాడని.. అందరూ ఇంట్లోనే ఉండాలని సురక్షితంగా ఉండాలని నాగ్ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments